కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీరోల్ సర్పంచ్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో
కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో చేరిన సర్పంచ్
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కోట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
నర్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో బీరోల్ గ్రామ స్వతంత్ర సర్పంచ్ మోముల సుధాకర్, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, వారి అనుచరులు, బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సంగారెడ్డి, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
