గడప గడప కు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న కోలుకుంద గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ
ఇంటి ఇంటికి చెత్త బుట్టాలను పంపిణీ చేసిన సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సం
ఘం ప్రధాన కార్యదర్శి, మోమిన్ పేట మండలంలోని కోలుకుంద గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు శంకర్, నాగమణి, రాజమణి, స్వరూప, కాసిం, గ్రామ పెద్దలు సంగమేశ్వర్, అబ్దుల్, గొల్ల కుమార్, షాబుద్దీన్, చోటు మియా, పరశురాం, జహంగీర్, ఏసప్ప, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
