వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానం చేసిన వ్యాపారులు

వికారాబాద్ మార్కెట్ యార్డ్ లో మౌళిక సౌకర్యలు కల్పిస్తాం : ఎఎంసి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి :
కూరగాయల మార్కెట్ కమిషన్ దారులు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ను మార్కెట్ ఆఫీస్ లో సోమవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మార్కెట్ యార్డ్ కు సంబంధించిన పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు.  కూరగాయల మార్కెట్వా కమీషన్టి దారుల సమస్యలను సావధానంగా విన్న ఎఎంసి చైర్మన్తె శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ శాసనసభ సబాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ దారుల సంఘం అధ్యక్షుడు కిష్టారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, షరీఫ్, గోవర్ధన రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top