వికారాబాద్ కు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుడు
స్వాగతం పలికిన మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్ లో జరుగుతున్న డిసిసి అధ్యక్షుల అంతర్గత శిక్షణ కార్యక్రమానికిసోమవారం వచ్చారు. వికారాబాద్ వచ్చిన డిప్యూటీ సీఎంను వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య పూల కుండీ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పి స్నేహ మెహ్రా, ఆర్డిఓ వాసు చంద్ర, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
